Mla Mallareddy” మేడ్చేల్ ఎమ్మెల్యే, మాజీమంత్రి తన మాటలతో నవ్వులు పూయిస్తుంటాడు. ఎంత సీరియస్ మ్యాటర్ అయినా సింపుల్‌గా నవ్వు తెప్పించే విధంగా మాట్లాడటం ఆయన నైజం. అసెంబ్లీలో సీరియస్ గా డిస్కషన్ నడుస్తున్న సమయంలో ఎమ్మెల్యే మల్లన్నకు అవకాశం వచ్చింది. అందరూ కూడా మల్లన్న అదే అంశం మీద మాట్లాడుతారని అనుకున్నారు. కానీ అధ్యక్షుడికి ఒక రిక్వెస్ట్ చేస్తున్నానని అంటూ లేచాడు. అందరూ కృష్ణ జలాల మీద డిస్కషన్ జరుగుతుంది కాబట్టి దాని గురించే మాట్లాడుతారని అనుకున్నారు. కానీ ఆయన మాట్లాడుతూ.. 14న వసంత పంచమి, 15న 26 వేల పెండ్లిళ్లు ఉన్నాయన్నారు. ఈ రెండు సెలవులు ఇప్పించాలని స్పీకర్ దృష్టికి తీసుకొచ్చారు. దీంతో సభలోని సభ్యులు ఇరగబడి నవ్వారు. కొంతమంది జై మల్లన్న అంటూ నినాదాలు కూడా ఇచ్చారు.. స్పీకర్ కూడా చిన్నగా నవ్వుకున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది.
14, 15 తేదీల్లో వసంత పంచమి సందర్భంగా 26 వేల పెళ్లిళ్లు ఉన్నాయి కాబట్టి ఆ రెండు రోజులు అసెంబ్లీ సమావేశాలు పెట్టొద్దని కోరుకుంటున్నా – మేడ్చల్ ఎమ్మెల్యే మల్లా రెడ్డి pic.twitter.com/3kjk3KkVZg
— Telugu Scribe (@TeluguScribe) February 12, 2024
విద్యుదాఘాతంతో కానిస్టేబుల్ మృతి
Young Farmers” 45 ఏండ్లు వచ్చిన పెండ్లి కావడం లేదు.. ప్రోత్సాహకంగా రూ. 5 లక్షలివ్వండి