Double e Smart” హిరో రామ్ పోతినేని, పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో 2019లో ‘ఇస్మార్ట్ శంకర్‌స చిత్రం పెద్ద సక్సెస్ సాధించింది. అటు హీరో రామ్ కు, ఇటు పూరి జగన్ కి ఆ చిత్రం ఒక పెద్ద బ్రేక్ ఇచ్చింది. ఇది కాకుండా, ఎన్నాళ్ళ నుంచో మంచి సక్సెస్ కోసం ఎదురు చూస్తున్న పూరి జగన్ ఆ చిత్రంతో మళ్ళీ ఫామ్ లోకి వచ్చారు. (Double e Smart) ఆ చిత్రంలో హీరో రామ్ తెలంగాణ యాసతో మాస్ పాత్రలో అభిమానులను ఎంతగానే ఆకట్టుకున్నారు. పూరి జగన్ ఆ (Double e Smart) చిత్రంలో హీరో రామ్ కి ఎంత హైప్ ఇవ్వాలో అంత ఇచ్చారు. రామ్ కెరీర్ లో ‘ఇస్మార్ట్ శంకర్’ ఒక మరపురాని సినిమాగా మలిచారు. ఆ తరువాత ఈ ఇద్దరి కాంబినేషన్ లో ప్రస్తుతం ఆ సినిమాకి సీక్వెల్ గా ‘డబుల్ ఇస్మార్ట్‌స అనే చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఇప్పుడు చిత్రీకరణ దశలో వుంది. హీరో రామ్ పోతినేని పుట్టినరోజు సందర్భంగా ఆ చిత్రం నుంచి ఒక టీజర్ ను రిలీజ్ చేశారు. హీరో రామ్ కి (Double e Smart) ఈ ‘డబుల్ ఇస్మార్ట్ ఇంకొక మంచి బ్రేక్ ఇస్తుందనుకుంటున్నారు. ఎందుకంటే ‘ఇస్మార్ట్ శంకర్’ తరువాత హీరో రామ్ చిత్రాలు అంతగా బాక్స్ ఆఫీస్ దగ్గర నడవలేదు. ఇప్పుడు ఈ ‘డబుల్ ఇస్మార్ట్ సినిమా పైనే ఆశలు పెట్టుకున్నారు. ఇంకో పక్క డైరెక్టర్ పూరి జగన్నాథ్ కూడా ఈ (Double e Smart) సినిమాతో మళ్ళీ సక్సెస్ కొట్టాలని చూస్తున్నారు. అందుకనే ఈ చిత్రంపై దృష్టి పెట్టారు. ఎలాగయినా మళ్ళీ ఫామ్ లోకి రావాలని ట్రయి చేస్తున్నారు. సినిమా టీజర్ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతోంది. తెలుగులో మాత్రమే కాకుండా మలయాళం, కన్నడ, తమిళం, హిందీతో పాటు పలు భాషల్లో కూడా ఈ టీజర్ రిలీజ్ అయ్యింది.
Check Also
Gurugram accident” అదుపు తప్పి అడ్డంగా దూసుకెళ్లిన కారు.. ఇద్దరు స్టూడెంట్లు మృతి.. వీడియో
Gurugram accident” కారు అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టి అడ్డంగా లేన్‌లోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో పలు వాహనాలకు తీవ్ర …
Video Viral” ఈ గుర్రం ఏంటీ.. అమ్మాయిలను ఎగిరి తన్నింది.. వీడియో వైరల్
Video Viral” రోజూ సోషల్ మీడియాలో లక్షల్లో వీడియోలు అప్‌లోడ్ చేస్టుంటారు.. కొన్ని నవ్వుతెప్పిస్తుంటాయి.. నవ్వు తెప్పించే వీడియోలు లక్షల్లో …