Cleanliness” శంకరపట్నం, బీసీ ప్రతినిధి:
పరిసరాల పరిశుభ్రత మరియు వ్యక్తిగత పరిశుభ్రత అనేవి వర్షాకాలంలో మరింత ప్రాముఖ్యంగా పాటించాల్సిన విషయాలని మండల వైద్యాధికారి డాక్టర్ శ్రావణ్ కుమార్ అన్నారు.
మంగళవారం కరీంనగర్ జిల్లా మానకొండూర్ నియోజకవర్గంలోని శంకరపట్నం మండల కేంద్రంలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో కేశవపట్నం గ్రామాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించిన అనంతరం ఆయన మాట్లాడారు.
డాక్టర్ శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ:
“వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఎక్కువగా ఉంటుంది. నీటి నిల్వలు లేకుండా చూసుకోవాలి. దోమలు పెరిగి మలేరియా, డెంగ్యూలాంటి వ్యాధుల ప్రమాదం ఉంటుంది,” అని తెలిపారు.
అంతేకాక, పౌష్టికాహారం తీసుకోవడం, శుభ్రమైన నీటిని వినియోగించడం, ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవడం అవసరమన్నారు. ఈ విషయంలో ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
“ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందుబాటులో ఉన్న వైద్య సేవలను ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలి,” అని ఆయన ప్రజలను ఆహ్వానించారు.
ఈ కార్యక్రమంలో ఆరోగ్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

మీ కిచెన్‌ని క్లియర్‌గా & క్లీన్‌గా ఉంచండి!
✨ Homeor ఎయిర్‌టైట్ స్టోరేజ్ కంటైనర్స్ – నేటి ఆఫర్‌లో!
సెట్ ఆఫ్ 6 (1500ML) బ్రౌన్ కలర్ జార్స్
ఎయిర్‌టైట్ లాక్ – ఫ్రెష్‌నెస్‌ని లోపలే ఉంచండి
క్లియర్ లుక్ – లోపల ఏమున్నదో స్పష్టంగా కనిపిస్తుంది
స్టాకబుల్ డిజైన్ – స్పేస్ సేవింగ్ & ఫ్రిజ్ స్టోరేజ్‌కి పర్‌ఫెక్ట్
✅ 100% ఫుడ్ గ్రేడ్ & BPA ఫ్రీ ప్లాస్టిక్
వాడగల సామగ్రి:
➡️ బియ్యం, పప్పులు, సీరియల్స్, టీ, కాఫీ, పాస్తా, డ్రై ఫ్రూట్స్, స్నాక్స్ & మరెన్నో…
ధర: ₹699/- మాత్రమే (59% తగ్గింపు)
➡️ ఒక్క పీస్ ₹116.50 కి వచ్చేస్తుంది!
అమెజాన్‌లో కొనేందుకు https://amzn.to/4n4CgsEలింక్ పై క్లిక్ చేయండి
