Molangur”మొలంగూర్ శివాలయంలో కొలువుదీరిన గణనాథుడు…

Molangur”  శంకరపట్నం: డిసి ప్రతినిధి:
మొలంగూర్ గ్రామంలో గల పురాతనమైన భక్తుల కోరిన కోర్కెలు తీర్చి కొంగు బంగారం అయ్యే శివాలయంలో బుధవారం కొలువు దీరిన గణనాథుడు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు బంగి మఠం శివప్రసాద్ మాట్లాడారు. కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం మొలంగూర్ గ్రామానికి చెందిన సీనియర్ జర్నలిస్ట్ దండు సమ్మయ్య స్వరూప కుమార్తె అయిన, వెజ్జ కొమురయ్య కమల, కీర్తి కిరణ్ కుమార్, కాగజ్ నగర్ వాస్తవ్యులు, గణేష్ నవరాత్రి ఉత్సవాల్లో పురస్కరించుకొని మొలంగూరు శివాలయంలో గణేష్ విగ్రహాన్ని బహుకరణ చేయగా, గ్రామ నివాసి తాజా మాజీ గ్రామపంచాయతీ పాలకవర్గ సభ్యురాలు, సీనియర్ జర్నలిస్ట్ , దండు స్వరూప సమ్మయ్య కుటుంబ సభ్యులు గణనాథనికి ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రతిష్టాపన కార్యక్రమాన్ని నిర్వహించినట్లు పేర్కొన్నారు. గణనాధికి శివాలయంలో తొమ్మిది రోజులపాటు ప్రత్యేక పూజలు నిర్వహించి 10వ రోజు గ్రామంలోని చెరువులో వేద పండితుల మంత్రోత్సవాల నడుమ భారీ ఊరేగింపు నిర్వహించి నిమజ్జనం చేయడం జరుగుతుందని, భక్తులు నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి గణేష్ కృపకు పాత్రులు కాగలరని ఆలయ ప్రధాన అర్చకులు శివపసాద్ కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామపంచాయతీ తాజా మాజీ వార్డు సభ్యురాలు , సీనియర్ జర్నలిస్ట్ దండు స్వరూప సమ్మయ్య, కుటుంబ సభ్యులు, గ్రామస్తులు, చిరుత ప్రవీణ్, నాంపల్లి శ్రీకాంత్, చిరుత కిషోర్, గాజుల వినయ్ ,గాజుల అరవింద ,గాజుల అభిషే కూర వివేక్ ,జక్కని రాకేష్, భక్తులు,
గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *