Ganesh Mandapam Guidelines” గణేష్ మండపాల నిర్వహకులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి: సీఐ వెంకట్

Ganesh Mandapam Guidelines” శంకరపట్నం, డీసీ ప్రతినిధి:

గణేష్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా విగ్రహాల ఏర్పాటు చేసేందుకు గణేష్ మండపాల నిర్వహకులు ఆన్‌లైన్ అనుమతులు తప్పనిసరిగా పొందాలని, అలాగే మండపాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం అవసరమని హుజురాబాద్ రూరల్ సీఐ పులి వెంకట్ సూచించారు.

మంగళవారం మానకొండూర్ నియోజకవర్గంలోని శంకరపట్నం మండలంలోని కేశవపట్నం ఎస్సై కట్కూరి శేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో వివిధ రాజకీయ పార్టీల నాయకులు, మండల అధ్యక్షులు, పూజారులు, గణేష్ మండపాల నిర్వాహకులు పాల్గొన్నారు.

ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన సీఐ వెంకట్ మాట్లాడుతూ:

“పోలీసు స్టేషన్ పరిధిలోని గ్రామాల్లో గణేష్ మండపాలు నిర్వహించే ప్రతి నిర్వాహకుడు హిందూ మత సామరస్యాన్ని కాపాడుతూ, విభేదాలకు తావులేకుండా భక్తిశ్రద్ధలతో ఉత్సవాలను నిర్వహించాలి. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి,” అని తెలిపారు.

అలాగే, మండపాల వద్ద ఏర్పాటు చేసే మైకులు, లౌడ్ స్పీకర్లు ఇతరులకు ఇబ్బందులు కలిగించకుండా నియంత్రితంగా వాడాలన్నారు. ప్రతి మండపం వద్ద సీసీ కెమెరాలు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని, ఏదైనా ఘటనలు చోటు చేసుకుంటే నిర్వాహకులే బాధ్యత వహించాల్సి ఉంటుందని ఆయన హెచ్చరించారు.

అనుమతులు పొందే సమయంలో పోలీస్ శాఖ మార్గదర్శకాలను తప్పనిసరిగా పాటించాలని, నిర్లక్ష్యం చూపిన వారికి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. కుల, మత, రాజకీయ విభేదాలకు తావులేకుండా సమిష్టిగా గణేష్ నవరాత్రోత్సవాలను నిర్వహించి, గణేష్ కృపకు పాత్రులు కావాలని సూచించారు.

ఈ సమావేశంలో విద్యుత్ శాఖ ఏఈ సంపత్ రెడ్డి, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు గంట మహిపాల్, బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి అలివేలు సమ్మిరెడ్డి, కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి ఊకంటి మధుకర్, పూజారులు వెంకటేశ్వర్లు, బంగి మఠం అభిషేక్, మండలంలోని వివిధ గ్రామాల గణేష్ మండపాల నిర్వాహకులు, రాజకీయ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

 

మీ కిచెన్‌ని క్లియర్‌గా & క్లీన్‌గా ఉంచండి!
✨ Homeor ఎయిర్‌టైట్ స్టోరేజ్ కంటైనర్స్ – నేటి ఆఫర్‌లో!

సెట్ ఆఫ్ 6 (1500ML) బ్రౌన్ కలర్ జార్స్
ఎయిర్‌టైట్ లాక్ – ఫ్రెష్‌నెస్‌ని లోపలే ఉంచండి
క్లియర్ లుక్ – లోపల ఏమున్నదో స్పష్టంగా కనిపిస్తుంది
స్టాకబుల్ డిజైన్ – స్పేస్ సేవింగ్ & ఫ్రిజ్ స్టోరేజ్‌కి పర్‌ఫెక్ట్
✅ 100% ఫుడ్ గ్రేడ్ & BPA ఫ్రీ ప్లాస్టిక్

వాడగల సామగ్రి:
➡️ బియ్యం, పప్పులు, సీరియల్స్, టీ, కాఫీ, పాస్తా, డ్రై ఫ్రూట్స్, స్నాక్స్ & మరెన్నో…

ధర: ₹699/- మాత్రమే (59% తగ్గింపు)
➡️ ఒక్క పీస్ ₹116.50 కి వచ్చేస్తుంది!
అమెజాన్‌లో కొనేందుకు   https://amzn.to/4n4CgsEలింక్ పై క్లిక్ చేయండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *