Local News” మానకొండూర్ సిఐ ని సత్కరించిన ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం నాయకులు…
శంకరపట్నం డిసీ ప్రతినిధి..

మానకొండూరు సిఐగా బాధ్యతలు చేపట్టిన బి సంజీవ్ ను ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా సన్మానించినట్లు ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పారునంది జలపతి ఆదివారం తెలిపారు. ఈ సందర్భంగా జలపతి మాట్లాడారు. కరీంనగర్ జిల్లా మానకొండూర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గా బి సంజీవ్ ఇటీవల బాధ్యతలు స్వీకరించగా ఆలిండియా అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపి పుష్పగుచ్చం అందజేశామన్నారు. ఈ కార్యక్రమంలో ఆలిండియా అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర కార్యదర్శి సాంబార్ కొమురయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శి పారునంది జలపతి, నాయకులు గడ్డం అనిల్ అమ్మిగల్ల రాజయ్య తదితరులు పాల్గొన్నారు.
////////////////////////////////////////////////////////////
భక్తిశ్రద్ధలతో ఈస్టర్ వేడుకలు..
ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్న ఎమ్మెల్యే కవ్వంపల్లి..
శంకరపట్నం డిసీ ప్రతినిధి

భక్తిశ్రద్ధలతో ఈస్టర్ వేడుకల్లో ఆదివారం మానకొండూర్ శాసనసభ్యులు డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సత్యనారాయణ మాట్లాడారు. ఈస్టర్ వేడుకలను క్రైస్తవులు భక్తి, శ్రద్ధలతో జరుపుకుంటారని తెలిపారు. తెల్లవారు జామున జరిగిన ప్రత్యేక ప్రార్థనలో ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ పాల్గొన్నారు. చర్చి
ఆవరణలో ఏర్పాటు చేసిన ఐమాస్ లైట్లను ఎమ్మెల్యే సత్యనారాయణ ప్రారంభించినట్లు పేర్కొన్నారు. అనంతరం చర్చిలో జరిగిన ఈస్టర్ వేడుకల్లో పాల్గొని ఎమ్మెల్యే ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో క్రైస్తవ మత గురువు లు, క్రైస్తవ సోదరి సోదరీమణులు, తదితరులు పాల్గొన్నారు.
