Bangalore Crime” ఈ రోజుల్లో భార్యభర్తల మధ్య చిన్న చిన్న తగువులు అవడం భార్యభర్తలు దూరంగా పరిపాటిగా మారింది. ఇలాగే గొడవల కారణంగా దూరంగా ఉంటున్న భార్యను ఇంటికి రావాలని కోరినా ఇంటికి రావడం లేదని కోపంతో ఆమెకు వీడియో కాల్ చేసి ఇంటికి రాకపోతే ఉరేసుకుని చనిపోతున్నానని బెదిరించుదామనుకున్నాడు ఓ భర్త. ఇంటి లోపలి వైపు పై భాగానా తాడును బిగించి ఆ తాడును మెడకు చుట్టుకుని స్టూల్‌పై నిలబడి భార్యకు వీడియో కాల్ చేశాడు. ఇంటికి వస్తానంటేనే కిందికి దిగుతానని, లేకపోతే చనిపోతానని బెదిరించాడు. వీడియో కాల్ మాట్లాడుతున్న క్రమంలో ఫోన్ చేయి నుంచి జారింది. దీన్ని అందుకునే క్రమంలో స్టూల్ పక్కకు జరగడంతో తాడు మెడకు బలంగా బిగుసుకుని భర్త మృతి చెందాడు. ఈ ఘటన బెంగుళూరు సిటిలోని బాలగుంటలో బుధవారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. బీహార్ రాష్ట్రానికి చెందిన అమిత్ కుమార్ (28) (Bangalore Crime) బెంగుళూర్ నగరంలో జిమ్ ట్రయినర్‌గా ఉంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో ఏడాది క్రితం పక్కనే ఉంటున్న ఓ అమ్మాయిని ప్రేమించి పెద్దలను ఎదిరించి పెండ్లి చేసుకున్నాడు. కొంత కాలం తరువాత అమిత్ కు అతని భార్యకు మధ్య గొడవలు అవుతున్నాయి. ఈ క్రమంలో అమిత్ భార్య అతనికి దూరంగా ఉంటుడంతో ఇంటికి రప్పించేందుకు బెదిరించబోయి అమిత్ మృతి చెందాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి
Bharathiyudu”భారతీయుడు 2′ ట్రైలర్ రిలీజ్ కోసం ప్లాన్
Rajanna Siricilla Crime news”పిగుడుపాటుకు ఇద్దరు మృతి
Bull Viral video” ఫోన్ ఆడిక్షన్ ప్రాణం మీదకు తెచ్చింది. కుళ్లపొడిచిన ఎద్దు.. వీడియో వైరల్
Double e Smart” డబుల్ ఇస్మార్ట్ టీజర్ రిలీజ్
North korea” రెడ్ కల రెడ్ కలర్ లిప్‌స్టిక్‌పై ఉత్తర కొరియాలో నిషేధం
Mumbai News” బొంబాయిలో గాలిదుమారం బీభత్సం.. కూలిన హోర్డింగ్.. వీడియోలు వైరల్