Ethiopia Landslides” ఆఫ్రికా దేశమైన ఇథియోపియాలో ఘోర విషాదం చోటు చేసుకుంది. కొండచరియలు విరిగిపడి 229 మంది మృతి చెందినట్టు సమాచారం. దక్షిణ ఇథియోఫియా కెంచో షాచా గోజ్డి గోఫాలో గెజ్ ఏరియాలో సోమవారం ఈ ఘటన చోటు చేసుకుంది. ఆ ప్రాంతంతో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాలకు కొండ చరియలు విరిగిపడ్డాయి. ప్రస్తుతానికి 229 మంది మృతి చెందారున. ఇంకా మృతుల సంఖ్య భారీగా పెరగనున్నట్టు తెలుస్తోంది. రెస్క్యూ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. శిథిలాల కింద ఇరుక్కున్న వారిలో తమవాళ్లను ప్రాణాలతో కాపాడుకునేందుకు అక్కడి వారు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఇథియోపియా రాజధాని అడిస్ అబాబా నుంచి అందాద 10 గంటల ప్రయాణంలో ఈ ప్రాంతం ఉంటుంది. సుమారు 450 కిలోమీటర్లు (270 మైళ్ళు) దూరం ఉంది. కొన్ని స్వచ్చంద సంస్థలు, ప్రభుత్వ యంత్రాంగం సహాయక చర్యల్లో తీవ్రంగా శ్రమిస్తున్నాయి.
ఇవి కూడా చదవండి
Bogota Falls” బొగత జలపాతం వద్ద విషాదం… యువకుడు మృతి
Budget 2024″ బంగారం, మొబైల్ ఫోన్లపై సుంకాల తగ్గింపు
Budget 2024″ బడ్జెట్ 2024 కొత్త పన్ను విధానంలో శ్లాబులు మారినయ్
Crime News” ఆరుగురు సొంత కుటుంబ సభ్యులనే చంపిన మాజీ సోల్జర్