Sunday , 8 September 2024
Breaking News

సలార్‌ సీక్రెట్స్‌ బయటపెట్టిన నిర్మాత

పాన్‌ ఇండియా స్టార్‌ ప్రభాస్‌ హీరోగా నటిస్తోన్న భారీ బడ్జెట్‌ యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘సలార్‌ పార్ట్‌ 1 సీజ్‌ ఫైర్‌’. అన్‌కాంప్రమైజ్డ్‌ బడ్జెట్‌తో అందరూ ఆశ్చర్యపోయే ప్రొడక్షన్‌ వేల్యూస్‌తో ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ హౌంబలే ఫిలిమ్స్‌ బ్యానర్‌పై విజయ్‌ కిరగందూర్‌ నిర్మించాడు. సెన్సేషనల్‌ డైరెక్టర్‌ ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో ఈ సినిమా రూపొందగా డిసెంబర్‌ 22న ప్రపంచ వ్యాప్తంగా గ్రాండ్‌ రిలీజ్‌ అవుతుంది. ఈ సందర్భంగా ‘సలార్‌ సీజ్‌ ఫైర్‌’ మూవీ జర్నీ గురించి హౌంబలే ఫిలిమ్స్‌ విజయ్‌ కిరగందూర్‌ కీలకమైన విషయాలను తెలియజేశారు. మేం సలార్‌ సినిమాను 2021లో ముహూర్తం పెట్టి స్టార్ట్‌ చేశాం, కానీ తర్వాత కోవిడ్‌ సెకండ్‌ వేవ్‌ స్టార్ట్‌ అయ్యింది.

రోడ్డుపైనే భార్యాభ‌ర్త‌ల ఫైటింగ్‌.. వీడియో వైర‌ల్.. 4 ల‌క్ష‌ల వ్యూస్

కోవిడ్‌ వేవ్స్‌ కారణంగా సినిమా షఉటింగ్‌ స్టార్ట్‌ చేయడానికి సమయం తీసుకున్నాం. 2022లో పూర్తి స్థాయి షఉటింగ్‌ ప్రారంభమవగా ఈ ఏడాది జనవరిలో షఉటింగ్‌ను పూర్తి చేశాం. తర్వాత పోస్ట్‌ ప్రొడక్షన్‌ వర్క్‌ స్టార్ట్‌ చేశాం, అయితే ఐదు భాషల్లో సినిమాను విడుదల చేయాలనుకున్నాం కాబట్టి చాలా జాగ్రత్తలు పాటిస్తూ వచ్చాం. అందులో డబ్బింగ్‌, సీజీ వర్క్‌ ఇలా అన్నింటికీ సమయం పట్టింది, అందుకే సినిమాను డిసెంబర్‌లో రిలీజ్‌ చేస్తున్నాం. మా హౌంబలే ఫిలిమ్స్‌ తొలిసారి తెలుగు హీరో ప్రభాస్‌గారితో వర్క్‌ చేశాం అయితే మిగిలిన టీమ్‌ అంతా పాతదే. ప్రశాంత్‌ నీల్‌, రవి బస్రూర్‌, ఆర్ట్‌ డైరెక్టర్‌ వీళ్లంతా హౌంబలేతో అనుబంధం ఉన్నవాళ్లే. అయితే సినిమాపై ఉన్న ఎక్స్‌పెక్టేషన్స్‌తో మేకింగ్‌ను ఛాలెంజింగ్‌గా తీసుకుని తెరకెక్కించాం, ప్రభాస్‌ చాలా మంచి వ్యక్తి, అందువల్లనే ఈ జర్నీ మాకొక మెమొరబుల్‌ ఎక్స్‌పీరియెన్స్‌నిచ్చింది మరీ ముఖ్యంగా సినిమా 90 శాతం షఉటింగ్‌ని తెలంగాణ, ఏపీలో చిత్రీకరించాం. మేకింగ్‌ పరంగా ఛాలెంజెస్‌ అంటే పెద్దగా లేవు. అయితే కెజియఫ్‌ వంటి భారీ హిట్‌ మూవీ తర్వాత మా బ్యానర్‌లో ప్రభాస్‌ నటిస్తుండటం, ప్రశాంత్‌ నీల్‌ ఆ సినిమాను డైరెక్ట్‌ చేస్తుండటంతో సినిమాపై అంచనాలు పీక్స్‌లో ఉన్నాయి. సలార్‌ కోసం ఓ కొత్త ప్రపంచాన్ని క్రియేట్‌ చేసి, దాని కోసం మేకింగ్‌ పరంగా ఎక్కడా కాంప్రమైజ్‌ కాలేదు, మేకింగ్‌లో ఇలాంటి సవాళ్లు తప్ప, మరేం ఎదురు కాలేదు.నేను నిర్మాతగా చేసిన తొలి సినిమా నిన్నిందలే, సెకండ్‌ మూవీ మాస్టర్‌ పీస్‌, తర్వాత రాజకుమార అయితే ఇవన్నీ మంచి విజయాలను సాధించాయి. రాజకుమార అయితే సూపర్‌ డూపర్‌ హిట్‌, ఇక నా నాలుగో సినిమా కె.జి.యఫ్‌1 తర్వాత యువరత్న, కె.జి.యఫ్‌ 2, కాంతార సినిమాలను రూపొందించా. ఇప్పడు సలార్‌తో మీ ముందుకు రాబోతున్నా, ఒక్కో మూవీ ఒక్కో అనుభవాన్ని నేర్పించింది. ప్రతీ విషయం నాకు మంచిగానే అనిపిస్తుంది. తొలి రోజు నేను ఇక్కడ జర్నీ స్టార్ట్‌ చేసినప్పుడు నిర్మాతగా నాకున్న నాలెడ్జ్‌కి ఇప్పుడు నాకున్న నాలెడ్జ్‌కి చాలా తేడా ఉంది, ముఖ్యంగా నెట్‌ వర్క్‌ పెరిగింది. అవును కానీ నిర్మాతగా నా ఆలోచనా విధానంలో మార్పు లేదు. ఇండియన్‌ సినీ ఇండిస్టీ రేంజ్‌ని నెక్ట్స్‌ రేంజ్‌కి తీసుకెళ్లాలనేదే నా ఆలోచన, మన సంస్కతి, సంప్రదాయాలు, భాషలు అన్నీ వేరువేరుగా ఉంటాయి, అయితే అన్నీ కలిస్తేనే ఇండియన్‌ సినీ ఇండిస్టీ అవుతుంది. దాన్ని గ్లోబెల్‌ రేంజ్‌కి తీసుకెళ్లాలనేదే నా అభిప్రాయం, అంతే తప్ప ఇది తెలుగు, ఇది కన్నడ సినిమా అని ఆలోచించడం లేదు.ప్రశాంత్‌ నీల్‌ నాకొక డైరెక్టర్‌గా పరిచయం అయ్యారు, తర్వాత ఫ్రెండ్‌, తర్వాత క్లోజ్‌ ఫ్రెండ్‌ అయ్యారు. ఇప్పుడు ఫ్యామిలీ మెంబర్‌ అయిపోయాడు, సినిమా విషయానికి వస్తే తనకున్న క్రియేటివిటీకి నేనొక ఫ్లాట్‌ ఫామ్‌ మాత్రమే. తన క్రియేటివిటీకి ఏం కావాలనే విషయాలు సమకూర్చటం అనేది నిర్మాతగా నా బాధ్యత, దాన్ని నేను పూర్తి చేస్తున్నా. అలాగే ప్రొడక్షన్‌, మార్కెటింగ్‌లలో తన ఇన్‌వాల్వ్‌ కాడు. ఇలా ఇద్దరి మధ్య మంచి అనుబంధం, అవగాహనతో ముందుకెళ్తున్నాం, ఒకవైపు మా ప్రయాణం డైరెక్టర్‌గా, ప్రొడ్యూసర్‌గా ఉంటుంది అలాగే మరో వైపు ఇద్దరం మంచి స్నేహితులం.

రాష్ట్రంలో 20మంది ఐపిఎస్‌ల బదిలీ… డిజిపిగా రవిగుప్తా కొనసాగింపు
ఆడియన్స్‌ నుంచి కె.జి.యఫ్‌ సినిమాకు వచ్చిన రెస్పాన్స్‌ గురించి మాటల్లో ఎంత చెప్పినా తక్కువే, కన్నడతో పాటు తెలుగు, తమిళ, మలయాళ, హిందీ ఆడియెన్స్‌లోనూ మంచి గుర్తింపు దక్కింది అయితే మమ్మల్ని చూసే విధానం మారింది. మాపై వాళ్లు చూపించిన ప్రేమాభిమానాలు, చూపించిన నమ్మకం మాలో మరింత బాధ్యతను పెంచాయి, అందుల్ల వాళ్లకి నచ్చేలా సినిమాలు చేయాలని ముందుకు వెళ్తున్నాం, మంచి సినిమాలు ఇవ్వాలనే కారణంగా మంచి కథలు ఎంచుకోవడంలో కాస్త ఆలస్యమవుతుంది తప్ప మరోటి కాదు.నిజానికి కెజియఫ్‌ 1 ని స్టార్ట్‌ చేసినప్పుడు రెండో భాగం చేయాలని అనుకోలేదు, షఉటింగ్‌ స్టార్ట్‌ అయిన తర్వాత అందులోని కంటెంట్‌ని గమనించిన డైరెక్టర్‌ టీమ్‌ అంతటినీ పిలిపించి కూర్చొని మాట్లాడారు. ఈ సినిమాను చేస్తే కుదించి చెప్పాలి, లేదా రెండు భాగాలుగా చేయాలని ఆయన అన్నారు. అలా కె.జి.యఫ్‌ 2 స్టార్ట్‌ చేశాం. అయితే కాంతార విషయంలో అలా కాదు, మా దగ్గర రెండు, మూడు కథలున్నాయి. అయితే కర్ణాటకలో ఎక్కడో మారుమూల ఉండే ఓ ప్రాంతానికి చెందిన ప్రజల సాంప్రదాయాన్ని, నమ్మకాన్ని ఇతరుల ఎలా తీసుకుంటారా? అని అనుకున్నాం. అయితే కొత్త ప్రయత్నం కదా, చేద్దామని కాంతార చేయగా ఆడియన్స్‌ నుంచి సూపర్బ్‌ రెస్పాన్స్‌ వచ్చింది. ఆ తర్వాత ‘కాంతార చాప్టర్‌ 1’ను చేయాలని అనుకుని స్టార్ట్‌ చేశాం, రెండు, మూడు పార్టులుగా రూపొందించేంత కంటెంట్‌ కాంతారలో ఉంది. ‘సలార్‌’ విషయంలోనూ అంతే, ఇందులో సినిమాను రెండు భాగాలుగా చేసేంత డ్రామా ఉంది, అందువల్లనే రెండు భాగాలుగా రూపొందించాలని అనుకున్నాం. ఎప్పుడైనా నేను చెప్పే మాట ఒకటే, బడ్జెట్‌ గురించి ఎక్కువగా డిస్కస్‌ చేయను. కాన్సెప్ట్‌ ఏంటి? కంటెంట్‌ ఎలా ఉంది. డైరెక్టర్‌ ఎవరు? డైరెక్టర్‌ చెప్పే కథ సెట్‌ అవుతుందా? ఎలా ఎగ్జిక్యూట్‌ చేస్తారు? స్టోరీ సీక్వెన్స్‌ కరెక్ట్‌గా ఉందా? ఈ సినిమా తీయడానికి ఇది కరెక్ట్‌ సమయమేనా? అనే విషయాలపై ఒకటికి పదిసార్లు ఆలోచిస్తా, ఆ తర్వాత నిర్ణయం తీసుకుంటా, కాంతార మినిమం బడ్జెట్‌తో చేశాం. ఆ సినిమా కావొచ్చు, మరో బిగ్‌ బడ్జెట్‌ మూవీ కావొచ్చు, నేను బడ్జెట్‌ ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వను. నాకు స్టోరీ, డైరెక్టర్‌ ముఖ్యం. ప్రభాస్‌ ఓ సూపర్‌ స్టార్‌, పాన్‌ ఇండియా రేంజ్‌లో ప్రశాంత్‌ నీల్‌ పెద్ద డైరెక్టర్‌. ఆయనకొక ఇమేజ్‌ క్రియేట్‌ అయ్యింది. వీరిద్దరి కాంబినేషన్‌లతో సినిమా అంటే ఎలా ఉండబోతుందోనని ఫ్యాన్స్‌, ప్రేక్షకులతో పాటు ఇండిస్టీ వర్గాలు సైతం ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. కెజియఫ్‌ తర్వాత ప్రశాంత్‌ నీల్‌ ఎలాంటి కథను చూపించబోతున్నాడో, ప్రభాస్‌ను ఎలా చూపించబోతున్నారనే అందరూ ఎగ్జయిట్‌ గా చూస్తున్నారు. టైట్‌ టైమ్‌ షెడ్యూల్‌ లో ఉన్నాం, ఓ వైపు ప్రభాస్‌, మరో వైపు ప్రశాంత్‌ నీల్‌ ఇద్దరూ బిజీగా ఉన్నారు. సినిమా రిలీజ్‌ తర్వాత గ్రాండ్‌ సక్సెస్‌ ఈవెంట్‌ను కండెక్ట్‌ చేస్తాం అని ఇంటర్వ్యూ ముగించారు చిత్ర నిర్మాత విజయ్‌ కిరగందూర్‌.

న్యూ ఇయ‌ర్ నిబంధనలు ఇవే..

‘ధోనీ’కి ఇదే చివరి ఐపీఎల్‌..? కార‌ణాలు ఇవే

రాష్ట్రంలో 20మంది ఐపిఎస్‌ల బదిలీ… డిజిపిగా రవిగుప్తా కొనసాగింపు

About Dc Telugu

Check Also

Scooty Viral Video

Scooty Viral Video” లాంగ్ స్కూటీ.. కారులెక్క న‌లుగురు కూర్చోవ‌చ్చు… వీడియో వైర‌ల్

Scooty Viral Video”  కుటుంబ స‌భ్యులు కానీ.. ఫ్రెండ్స్ కానీ ముగ్గురు న‌లుగురు ఒకే వాహ‌నంలోపోవాలంటే క‌చ్చితంగా కారు కావాల్సిందే. …

Amazon Offers

Amazon Offers” ఇండోర్ మొక్క‌ల‌పై 50 శాతం త‌గ్గింపు.. ఇప్పుడే బుక్ చేయండి అమెజాన్‌లో..

Amazon Offers” ఇళ్లు లేదా ఆఫీస్‌ను అందంగా తీర్చిదిద్దుకోవాల‌న్న‌ది అంద‌రి కోరిక. చాలా మంది బోన్సాయి మొక్క‌ల‌ను పెంచుకుంటురు. అందుకోస‌మే …

Viral Video

Viral Video” కండ్లు చెదిరే రియ‌ల్ చేజింగ్‌.. సినిమాల్లో కాదు.. వీడియో వైర‌ల్

Viral Video” ముందు విల‌న్ వెన‌కాలే హీరో చేజింగ్ న‌డుస్తుంటే కండ్లు ప‌క్క‌కు తిప్ప‌కుండా టెన్ష‌న్ ప‌డ‌కుండా చూస్తాం. ఇదీ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Social Media Auto Publish Powered By : XYZScripts.com