Local News”
శంకరపట్నం: డిసి ప్రతినిధి
కరీంనగర్ భగత్ నగర్ లయన్స్ క్లబ్ ప్రధాన కార్యదర్శిగా సీనియర్ న్యాయవాది, తెలంగాణ ఉద్యమకారుడు, మాజీ సర్పంచ్, మాజీ ఎంపిటిసి, చౌడమల్ల వీరస్వామి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా వీరస్వామి మాట్లాడారు. కరీంనగర్ పట్టణంలో భగత్ నగర్ లాయర్స్ క్లబ్ జనరల్ బాడీ సమావేశం నిర్వహించుకొని 20 25/2026 సంవత్సరం నూతన బాడిని సమావేశంలో ఏకగ్రీవంగా నియామకం చేసినట్లు పేర్కొన్నారు. అధ్యక్షులుగా శ్రీగిరి శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శిగా చౌడమల్ల వీరస్వామి, కోశాధికారిగా మామిడాల రమణ, మరి కొంతమందిని సమావేశంలో పాలకవర్గ సభ్యులుగా నియామకం చేసినట్లు వీరస్వామి తెలిపారు. తన నియామకానికి కృషి చేసిన మన బాడీ క్లబ్ సభ్యులందరికీ వీరస్వామి కృతజ్ఞతలు తెలిపారు.
