Viral Accident” ఇది మామూలు స్పీడ్ కాదు

Viral Accident”  ముందు వెళ్తున్న లారీని ఓవ‌ర్టేక్ చేయాల‌ని వాట‌ర్ ట్యాంక‌ర్‌ను అత్యంత వేగంగా న‌డిపాడు. లారీని ఓవ‌ర్ టేక్ చేసి వ్యాట‌ర్ ట్యాంక‌ర్ ప‌ల్టీలు కొట్టింది. ఈ ఘ‌ట‌న‌లో ట్యాంక‌ర్ డ్రైవ‌ర్, మ‌రొక ప్ర‌యాణికుడు గాయ‌ప‌డ్డాడు. గాయ‌ప‌డ్డ ఇద్ద‌రినీ ద‌గ్గ‌ర్లోని ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. వివ‌రాలు పరిశీలిస్తే కర్ణాటకలోని బెంగళూరులో ఓ ట్రక్కును ఓవర్‌టేక్ చేసేందుకు వాటర్ ట్యాంకర్ ప్ర‌య‌త్నించింది. ఈ క్ర‌మంలో ట్యాంక‌ర్ అతివేగంగా ప్ర‌యాణించి నియంత్రణ కోల్పోయి ట్ర‌క్కును దాటి రోడ్డుపైనే పల్టీలు కొట్టింది. రోడ్డు చివ‌రి నుంచి ఎడమవైపుకు తిరిగేటప్పుడు ట్రక్కు డ్రైవర్ వాహనంపై నియంత్రణ కోల్పోయాడు. ఈ ఘటన సోమ‌వారం మధ్యాహ్నం దొమ్మసాంద్ర సమీపంలో చోటు చేసుకుంది. వాటర్ ట్యాంకర్ వర్తూర్ నుండి దొమ్మసాంద్రకు ప్రయాణిస్తున్న‌ది. ఈ రెండు వాహ‌నాల‌ ముందు వెళ్తున్న కారు యొక్క‌ డాష్ కెమెరా ప్ర‌మాద దృశ్యాల్ని బంధించింది. అయితే వాట‌ర్ ట్యాంక‌ర్ బొల్తా ప‌డ‌గానే లారీ డ్రైవ‌ర్‌గా స‌మ‌య‌స్పూర్తితో త‌న లారీ బ్రేకులు వేశాడు. లేక‌పోతే ప్ర‌మాదం మ‌రింత ఎక్కువ‌గా ఉండేది.  బంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది.

 

ఇవి కూడా చ‌ద‌వండి

Shankarapatnam news”మండ‌ల వ్యాప్తంగా.. గ్రామ గ్రామానా అంబేద్క‌ర్ జ‌యంతి

TGRJC-CET” రెసిడెన్షియ‌ల్ కాలేజీల్లో ఇంట‌ర్ ప్ర‌వేశాలు..

Helicopter accident” ఈ న‌ట్టే సీఈవో ప్రాణం తీసింది.. హెలికాప్ట‌ర్ ప్ర‌మాదం వీడియో

Samsung Galaxy” సాంసంగ్ నుంచి రెండు అద్బుత‌మైన ఫోన్లు.. వివ‌రాలు పరిశీలించండి..

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *