Woman dies” ఆత్మహత్యాయత్నం చేసిన మహిళ చికిత్స పొందుతూ మహిళ మృతి..

Woman dies”  శంకరపట్నం డిసి ప్రతినిధి  కరీంనగర్ జిల్లా, శంకరపట్నం మండలం, ఇప్పలపల్లె గ్రామంలో ఓ మహిళ చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ విషాద ఘటనకు సంబంధించిన వివరాలను కేశవపట్నం ఎస్‌ఐ కట్కూరి శేఖర్ రెడ్డి వెల్లడించారు. ఆయ‌న వివ‌రాల ప్ర‌కారం.. వెంగళ పోచమ్మ (ఇప్పలపల్లె గ్రామం నివాసిని) అనారోగ్య సమస్యలతో గత కొన్ని నెలలుగా అనేక ఆసుపత్రుల్లో చికిత్స పొందింది.

ఆరోగ్యం మెరుగుపడకపోవడంతో ఆమె తీవ్ర మానసిక ఆందోళనకు గురై, ఈ నెల 16న ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుమందు సేవించింది.
ఈ సంఘటన కుటుంబ సభ్యులకు తెలియగా, తక్షణమే ఆమెను కరీంనగర్ ఆసుపత్రికి తరలించారు.

చికిత్స పొందుతున్న సమయంలో గురువారం ఆమె పరిస్థితి మరింత తీవ్రతరం కావడంతో ఆసుపత్రిలో మృతి చెందింది.

ఈ మేర‌కు పోచమ్మ భర్త వెంగళ సారయ్య ఫిర్యాదు ఇవ్వ‌డంతో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించిన‌ట్టు ఎస్ ఐ తెలిపారు.

Narzo 80 Pro 5G ” రియల్‌మీ గేమింగ్‌కి కొత్త డెఫినిషన్!

గ్రామంలో ఈ సంఘటనపై కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో ఉన్నారు. ఇప్పలపల్లె గ్రామంలో విషాద ఛాయలు వ్యాప్తి చెందాయి.

బంపర్ ఆఫర్!
పానసొనిక్ 10W LED బ్యాటన్ (Pack of 4)
ఇప్పుడు కేవలం ₹549కే!
39% డిస్కౌంట్
కూల్ డే వైట్ లైట్ ✨
ఎనర్జీ సేవింగ్ | నమ్మకమైన బ్రాండ్

ఇంత తక్కువ ధరలో అంత మంచి క్వాలిటీ!
తడాపట్టి లైట్ మార్చేయండి!

#పానసొనిక్ #LEDలైట్స్

అమెజాన్‌లో కొనుగోలు కోసం https://amzn.to/3GJquo0 లింక్ పై క్లిక్ చేయండి..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *