Aarogyam Mahila” మండల వైద్య అధికారి శ్రావణ్ కుమార్..
శంకరపట్నం డిసి ప్రతినిధి
ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు ప్రతి మంగళవారం మండల కేంద్రంలోని ఆరోగ్య మహిళా వైద్య సేవలను నిర్వహిస్తున్నట్టు ఈ సేవలను వినియోగించుకొని మహిళలు ఆరోగ్యవంతమైన జీవితం పొందాలని మండల వైద్యాధికారి గొట్టే శ్రావణ్ కుమార్ అన్నారు.
కరీంనగర్ జిల్లా, మానకొండూర్ నియోజకవర్గం ,శంకరపట్నం మండలంలోని గద్దపాక గ్రామంలో శుక్రవారం అంగన్వాడి కేంద్రంలో డ్రై డే.. ఫ్రైడే గ్రామసభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన మండల వైద్యాధికారి శ్రావణ్ కుమార్ మాట్లాడారు.
చిన్నారుల, మహిళల ఆరోగ్యమే లక్ష్యంగా అంగన్వాడీ కేంద్రాల ద్వారా పౌష్టికాహారాన్ని అందిస్తున్నట్టు చెప్పారు. అంగన్వాడి సేవలను సద్వినియోగం చేసుకుంటూ, ప్రభుత్వము మహిళల ఆరోగ్యం కోసం ప్రతి మంగళవారం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మహిళలకు దీర్ఘకాలిక వ్యాధులు, ఇతర వ్యాధుల నిర్ధారణ కోసం పరీక్షలు నిర్వహిస్తున్నట్టు చెప్పారు. మహిళలు ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆరోగ్య మహిళ వైద్య సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో అంగన్వాడి సూపర్వైజర్ పద్మ, ఎం ఎల్ హెచ్ పి మహేశ్వరి, హెల్త్ సూపర్వైజర్ అనిల్, అంగన్వాడీ టీచర్లు, ఏఎన్ఎంలు, మహిళలు గర్భిణీ స్త్రీలు చిన్నారులు తదితరులు పాల్గొన్నారు.

రాఖీ అంటే బంధం.. కాదు కదా, ప్రేమ, విశ్వాసం,
ఈ రాఖీ పండుగ రోజున,
తమ్ముడికి మాత్రమే కాకుండా మన వదినకు కూడా
ఒక ప్రత్యేక గిఫ్ట్ ఇవ్వాలని అనుకుంటున్నారా?
CraftVatika నుండి వచ్చిన
కుందన్ రాఖీ సెట్స్‌తో పాటు
“King Bhaiya – Queen Bhabhi” మగ్స్ గిఫ్ట్ కాంబో తో
ఈ రాఖీ ని మరింత ప్రత్యేకంగా మార్చండి! ☕
ఒక మంచి బంధానికి గుర్తుగా…
ప్రేమను వ్యక్తీకరించే ఒక చిన్న ప్రయత్నంగా…
ఈ రాఖీ సెట్స్ తో మీ భయ్-వదిన హృదయాలు గెలవండి!
ఈ సంవత్సరం రాఖీకి ఒక కొత్త అర్థం ఇవ్వండి…
ప్రేమ, గౌరవం, నవ్వుల గిఫ్ట్‌తో!
https://amzn.to/4mdsK5Xలింక్ పై క్లిక్ చేయండి.. అమెజాన్‌లో బుక్ చేయండి..
