షి’కారు’లో రోమాన్స్.. స్వేచ్చ ఉంది క‌దా అని.. స‌జ్జ‌నార్ ట్విట్.. వీడియో వైర‌ల్‌

యువ‌త ఎంజాయ్ చేయ‌డంలో కొత్త‌ద‌నం వెతుక్కుంటుంది. కానీ అది అప్ప‌డ‌ప్పుడు ఎదుటివారిని ఇబ్బందుల‌కు గురిచేసేలా కూడా ఉంటున్నాయి. హైద‌రాబాద్ కు చెందిన ఓ యువ ప్రేమ జంట కారులో వెళ్తూ రోడ్డుపైనే స‌న్‌రూప్ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చి లిప్‌లాక్ ముద్దుల‌తో రెచ్చిపోయింది. గాల్లో చేతులు ఉపుతూ ముందుకు సాగారు. వెనుకాల వ‌స్తున్న మ‌రో వాహ‌నం వారు వీడియో తీసి సోష‌ల్ మీడియాలో పోస్టు చేశారు. ఈ ఘ‌ట‌న ఆదివారం రాత్రి పీవీఎన్ ఎక్స్‌ప్రెస్ హైవేపై చోటు చేసుకుంది. ఈ వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. తాజాగా ఆర్టీసీ ఎండీ స‌జ్జ‌నార్ ఐపీఎస్ ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చేశారు. స్వేచ్చ ఉంది కదా అని ఎదుటి వారిని ఇబ్బందులకు గురిచేసేలా ప్ర‌వ‌ర్తించ‌డం స‌రికాద‌ని ట్విట్ చేశారు. .

రిటైర్డ్ నేవి ఆఫీస‌ర్‌కు సైబ‌ర్ వ‌ల.. రూ. 2.37 ల‌క్షల మోసం

ఎదురుగా మిలిటెంట్లు… వంద బుల్లెట్లు కాల్చినా బ‌తికిండు

బైక్‌పై చేజ్‌.. ఒంటిచేత్తో కాల్పులు.. ఈ వీడియో మీరు చూడండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *