జ‌నం ఏరీ…? రేవంత్‌రెడ్డి ముఖ్య‌మంత్రి కావాల్నా వ‌ద్దా..? ముందు ఎమ్మెల్యేగా గెలిపించండి

కొడంగ‌ల్ నియోజ‌క‌వ‌ర్గ‌లోని బోంరాస్ పేట‌లో శ‌నివారం రోడ్ షో నిర్వ‌హించారు. ఈ రోడ్ షోకు మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ నాయ‌కుడు గుర్నాథ్ రెడ్డి హాజ‌రై మాట్లాడారు. ఆయ‌న మాటల్లో నాలెక్క ప్ర‌కారం.. బోంరాస్ పేట‌లో చాలా త‌క్కువ మంది హాజ‌ర‌య్యారు. ఇప్ప‌టి వ‌ర‌కు నేను నాలుగు మీటింగ్‌లో హాజ‌రైన నాలుగు ఊర్ల‌లో అన్నింటికంటే త‌క్కువ మంది ఇదే ఊర్లో క‌నిపిస్తున్న‌రంటూ అస‌హ‌నం వ్య‌క్తం చేశారు. గ్రామాల్లోని ప్ర‌జ‌లు కూళ్ల‌కు పోయిర్రా..? చేన్లు కోస్తున్న‌రు. వ‌రిచేను ముఖ్యంకాని రేవంత్ రెడ్డి వ‌చ్చేది ముఖ్యం కాదా అని ప్ర‌శ్నించారు. భీక‌రంగా క‌నిపిస్తుంద‌న‌కున్నా.. కానీ చాలా త‌క్కువ మంది క‌నిపిస్తున్నార‌ని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. ముఖ్య‌మంత్రి చూడాల‌నుకుంటున్న‌రు క‌దా. ముందు ఎమ్మెల్యేగా గెలువాల‌ని అన్నారు. దీనికి సంబంధించిన వీడియోను తెలుగు స్క్రైబ్ అనే ఎక్స్ (ట్విట్ట‌ర్‌) ఖాతాలో పోస్టు చేశారు.

 

ఇవికూడా చ‌ద‌వండి

సౌరవ్ రికార్డును రోహిత్ బ్రేక్‌.. సీరియ‌ల్ గా ఎక్కువ మ్యాచ్‌లు గెలిసింది వీళ్లే..

నాడు 2003లో ఇదే ప్ర‌త్య‌ర్థి .. నాలుగుసార్లు ఫైన‌ల్ చేరి.. మూడోసారి ముద్దాడుతుందా…ఎప్పుడెప్పుడు ఏం జ‌రిగింది.

ఖర్గే సమక్షంలో కాంగ్రెస్‌లోకి విజ‌య శాంతి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *