తెలంగాణాలో నిరుద్యోగుల‌కు గుడ్ న్యూస్

ప్ర‌భుత్వ ఉద్యోగ నియామక పరీక్షల వయోపరిమితి పెంచుతూ తెలంగాణ రాష్ట్ర గ‌వ‌ర్న‌మెంట్ కీలక నిర్ణయం తీసుకుంది. తాజాగా దీనికి సంబంధించిన ఉత్తర్వుల‌ను జారీ చేసింది. 46 ఏళ్ల వ‌య‌స్సు వ‌ర‌కు ఉద్యోగాలకు అప్ల‌యి చేసుకునే విధంగా వయో పరిమితి సడలింపుకు సీఎం రేవంత్‌ రెడ్డి హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా.. వయోపరిమితిని 46 సంవ‌త్సారాల‌కు పెంచి త్వరలోనే టీఎస్‌పీఎస్సీ గ్రూప్‌-1 నిర్వహిస్తామని అసెంబ్లీలో ప్రకటించారు. ఈ నేప‌థ్యంలో తాజాగా వయో పరిమితి 46 ఏండ్ల‌కు పెంచుతున్న‌ట్టు తీసుకున్న నిర్ణయంతో జీవో సోమ‌వారం విడుదల చేశారు. గ్రూపు-1 పోస్టుల భర్తీ కోసం మళ్లీ నోటిఫికేషన్‌ జారీ చేయాలని గ‌వ‌ర్న‌మెంట్ తీసుకున్న నిర్ణయం తెలిసిందే. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను తెలంగాణ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్ ఇప్పటికే పూర్తి చేసింది.

ఇవి కూడా చ‌దవండి

Hukka Ban” తెలంగాణాలో హుక్కా నిషేధం

Rapido” పాపం.. పెట్రోల్ అయిపోయినా … తోసుకుంటూ వెళ్లాడు.. వీడియో వైర‌ల్..

ktr tweet” కాంగ్రెస్ తీర్మానం.. బీఆర్ ఎస్ ఎఫెక్టే..కేటీఆర్ ట్వీట్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *