Karimnagar crime news” పిల్ల‌ల‌ను కాపాడ‌బోయి తండ్రి మృతి.. క‌రీంన‌గ‌ర్ లో విషాదం..

Karimnagar crime news

Karimnagar crime news”  నీళ్ల‌లో ప‌డిన బిడ్డ‌ను కాపాడబోయి తండ్రి మృతి చెందిన ఘ‌ట‌న క‌రీంన‌గ‌ర్ జిల్లాలోని తిమ్మాపూర్లో సోమ‌వారం చోటు చేసుకుంది. వివ‌రాల్లోకివెళ్తే.. క‌రీంన‌గ‌ర్ జిల్లా కేంద్రంలోని సంతోష్ న‌గ‌ర్‌లో నివాస‌ముంటున్న బంగారి విజ‌య్ ఆసిఫాబాద్ కొమురం భీం జిల్లాలోని పే అండ్ అకౌంట్స్ ఆఫీస్‌లో సూప‌రింటెండెంట్‌గా విధులు నిర్వ‌హిస్తున్నారు. ఈ క్ర‌మంలో రెండు రోజులు సెల‌వులు రావ‌డంతో భార్య ప్ర‌శాంతి, కూతురు సాయి నిత్య‌, కొడుకు విక్రాంత్ , అత్త‌తో క‌లిసి హుస్నాబాద్ మండ‌లం పొట్ల‌ప‌ల్లిలోని శివాల‌యం ద‌ర్శించుకున్నారు. తిరిగి క‌రీంన‌గ‌ర్ వస్తున్న క్ర‌మంలో ఎల్ ఎండీ రిజర్వాయ‌ర్ వ‌ద్ద స‌ర‌దాగా గ‌డిపేందుకు కొద్దిసేపు ఆగారు. కాక‌తీయ కాలువ హెడ్ రెగ్యులరేట‌ర్ గేట్ల వ‌ద్ద ఫొటో దిగేందుకు వెళ్లారు. ఫొటో దిగుతున్న క్ర‌మంలో కూతురు సాయి నిత్య ప్ర‌మాద‌వ‌శాత్తు కాలువ‌లో ప‌డిపోయింది. వెంట‌నే కూతురును కాపాడేందుకు విజ‌య్ నీళ్ల‌లో దూకాడు. ఆ వెంట‌నే కొడుకు విక్రాంత్ కూడా వారిని కాపాడేందుకు నీళ్ల‌లో దూకాడు. విజ‌య్ భార్య ప్ర‌శాంతి, అత్త కేకలు వేయ‌డంతో సమీపంలో ఉన్న జాల‌రీ శంక‌ర్ కాలువ‌లో దూకి పిల్ల‌లిద్ద‌రినీ కాపాడాడు. విజ‌య్ (47) నీళ్ల‌లో మునిగి దుర్మ‌ర‌ణం చెందాడు. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు ద‌ర్యాప్తు చేస్తున్న‌ట్టు తెలిపారు.. విష‌యం తెలుసుకున్న మాన‌కొండూర్ ఎమ్మెల్యే క‌వ్వంప‌ల్లి స‌త్య‌నారాయ‌ణ బాధిత కుటుంబాన్ని ప‌రామ‌ర్శించారు. పిల్ల‌ల‌ను కాపాడిన శంక‌ర్‌ను మాన‌కొండూర్ ఎమ్మెల్యే అభినందించారు.

 

బాధిత కుటుంబాన్ని ప‌రామ‌ర్శిస్తున్న మాన‌కొండూర్ ఎమ్మెల్యే

ఇవి కూడా చ‌ద‌వండి

viral Video” చేతులు వ‌దిలి బైక్ పై యువ‌తి స్టంట్స్.. వీడియో వైర‌ల్

train accident in bengal” బెంగాల్‌లో ఘోర రైలు ప్ర‌మాదం.. ప‌ల్టీలు కొట్టిన రైలు భోగీలు

up couple” నదిలోకి దూకి ప్రేమ‌జంట‌ ఆత్మహత్యాయత్నం.. కాపాడి ప్రియుడి చెంప పగలకొట్టిన మత్స్యకారుడు

crime news” అడ్డుగా ఉన్నార‌ని అంతం.. ఓ చోట కొడుకును చంపిన త‌ల్లి.. మ‌రో చోట భ‌ర్త‌ను చంపిన భార్య

Ap crime news” నచ్చని పెళ్లి సంబంధం తెచ్చిండ‌ని.. తండ్రిని కొట్టి చంపిన కూతురు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *