bulls fight Viral video” ట్రయిన్ పట్టాలపై దూసుకెళ్తుంటే మనుషులు, జంతువులు పక్కకు తప్పుకోవాల్సిందే. రైలు వేగంగా వెళ్తుంది కాబట్టి సడెన్ గా ఆపడం కుదరదు. కానీ రెండు గిత్తలు కొట్లాట మాత్రం రైలును ఆపేసింది. ఈ ఘటన ఉత్తర ప్రదేశ్‌లో చోటు చేసుకుంది. ఓ రైల్వే గేటు వద్ద రైలు వస్తుందని గేటు వేశారు. కానీ రెండు ఎద్దులు మాత్రం పొట్లాడుకుంటూ గేటు దాటి ట్రాక్‌పైకి వెళ్లాయి. పట్టు విడవకుండా ఫైటింగ్ చేసుకుంటూనే ఉన్నాయి. లోకోపైలెట్ హారన్ మోగించినా అవి మాత్రం పట్టించుకోలేదు. దీంతో లోకో పైలెట్ రైలును అక్కడే ఆపారు. కొద్దిసేపు పొట్లాడుకున్న తరువాత అవి అలిసి అక్కడి నుంచి వెళ్లిపోయాయి. ఆ తరువాత ఆ లోకోపైలెట్ ట్రయిన్‌ను ముందుకు వెళ్లనిచ్చారు. ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. నెటిజన్లు ఆ లోకోపైలెట్‌ను అభినందిస్తున్నారు.
पहले हार-जीत का फैसला होगा….. फिर रेलगाड़ी जाएगी….! #Bull #BullFight #train #Railways #nature #animal #AnimalLover #wild pic.twitter.com/V3c1FuKIkt
— Neeraj Mishra (@NrjNambo) July 6, 2024
ఇవి కూడా చదవండి
Viral Video”చుట్టుముట్టిన మొసళ్లు.. కొట్లాడి తప్పించుకున్న జీబ్రా.. వీడియో వైరల్
Up Bus accident” ఘోర బస్సు ప్రమాదం.. 18 మంది మృతి.. 30 మందికి గాయాలు
Nashik accident” లోయలో పడ్డ బస్సు.. వీడియో తీస్తుండగానే ఘటన
Marriage cheating” నిత్య పెళ్లి కూతురు.. 50 మందితో పెండ్లి..