Delhi Crime News” కాళ్లు మొక్కి.. కాల్చి చంపారు.. సీసీ వీడియో

Delhi Crime News

Delhi Crime News” ఈశాన్య ఢిల్లీలోని ఘోరం చోటు చేసుకుంది. కాళ్లు మొక్కి కాల్చి చంపారు.ఈ ఘ‌ట‌న బీహారీల కాల‌నీలో గురువారం చోటు చేసుకుంది. ఇంటి ముందు దీపావ‌ళి వేడుక‌లు చేసుకుంటున్న 40 ఏండ్ల వ్య‌క్తి అతని మేన‌ల్లుడు చ‌నిపోయారు. అత‌ని10 ఏండ్ల కుమారుడు గాయ‌ప‌డ్డాడు. కుటుంబీకులు, ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం.. బాధితులైన ఆకాష్ శర్మ, అతని మేనల్లుడు రిషబ్ శర్మ, కుమారుడు క్రిష్ శర్మ రాత్రి 8 గంటల స‌మ‌యంలో దీపావళి వేడుక‌లు చేసుకుంటున్నారు. ఆకాష్, రిషబ్ ఇద్దరూ పసుపు రంగు కుర్తాలు ధరించి వేడుక‌లు చేసుకుంటున్నారు. ఈ క్ర‌మంలో ఇద్ద‌రు వ్య‌క్తులు స్కూటర్‌పై అక్క‌డి వ‌చ్చారు. వారు ఆకాష్ కాళ్లు మొక్కారు. అనంత‌రం ఆకాష్ ఇంట్లోకి వెళ్తున్న‌ప్పుడు స్కూట‌ర్ పై నుంచి ఓ వ్య‌క్తి దిగి వచ్చి ఆకాష్ పై కాల్పులు జ‌రిపాడు. ఆకాష్ మేన‌ల్లుడు రిష‌బ్ నిందితుల‌ను అడ్డుకునేందుకు ప్ర‌య‌త్నించ‌గా అత‌నిపై కూడా కాల్పులు జ‌రిపాడు. ఈ ఘ‌ట‌న‌లో ఆకాష్‌, రిష‌బ్, ఆకాష్ కుమారుడు గాయ‌ప‌డ్డారు. గ‌మ‌నించిన కుటుంబ స‌భ్యులు వెంట‌నే పోలీసులకు ఫోన్ చేసి విష‌యం చెప్పారు. అనంత‌రం గాయ‌ప‌డ్డ వారిని ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. నిందుతులు త‌న‌కు తెలుస‌ని, వారితో చాలా ఏండ్లుగా భూమి విష‌యంలో వివాదం ఉంద‌ని ఆకాష్ భార్య నేష‌నల్ మీడియాతో తెలిపింది. వ్యక్తిగత క‌క్ష‌ల‌తోనే ఈ కాల్ప‌లు జ‌రిగాయ‌ని, ఘ‌ట‌న స్థ‌లంలో ఐదు రౌండ్ల బుల్లెట్లు పేలిన‌ట్టు అని షహదారా డీసీపీ ప్రశాంత్ గౌతమ్ వార్తా సంస్థ ANIకి తెలిపారు. త‌దుప‌రి విచార‌ణ కొన‌సాగుతుంద‌ని డీసీపీ వివ‌రించారు.

 

 

మ‌రెన్నో ఇంట్ర‌స్టింగ్ క‌థ‌నాల‌కోసం ఈ లింక్ ను క్లిక్ చేయండి… https://whatsapp.com/channel/0029VaBklCu6xCST8YUVgT00

ఇవి కూడా చ‌ద‌వండి

Ceiling Duster” లాంగ్ హ్యాండిల్ సీలింగ్ డస్టర్.. కేవ‌లం 299 రూపాయ‌లే..

Onion bombs” పేలిన ఉల్లిగ‌డ్డ బాంబులు.. ముక్క‌లైన వ్యక్తి.. వీడియో వైర‌ల్

Pad And Tabs” బ్రాండెడ్ ట్యాబ్‌, ఐప్యాడ్‌ల‌పై భారీ త‌గ్గింపు.. హాన‌ర్ ట్యాబ్ కేవ‌లం రూ. 9,999 కే

Cobra Viral Video” ఒళ్లు జ‌ల‌ద‌రించే స్టంట్‌… భారీ నాగు పాము త‌ల‌పై ముద్దు… వీడియో వైర‌ల్

Krishna With Cow Standing” గిఫ్ట్స్ మెటల్ కృష్ణ విత్ ఆవు స్టాండింగ్ విగ్ర‌హం.. హోమ్ డెకర్… కేవ‌లం 274

Virla Video” ఇదేం పోయేకాలం.. క‌త్తుల‌మీద స్టంట్స్‌.. వీడియో వైర‌ల్

Noise Smart Watch” రూ.1298కే నాయిస్ స్మార్ట్ వాచ్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *