Shankarapatnam news” శంకరపట్నం డిసి ప్రతినిధి
భారత రాజ్యాంగ నిర్మాత ప్రపంచ మేధావి పేదల పెన్నిధి హక్కుల ప్రదత డాక్టర్ భీమ్ రావు అంబేద్కర్ జయంతి వేడుకలను సోమవారం మండల వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం కేశవపట్నం, మొలంగూర్, కన్నాపూర్, అంబాల్ పూర్, తాడికల్, కల్వల, కరీంపేట్, గ్రామాల్లో గల అంబేద్కర్ విగ్రహానికి, చిత్రపటాలకు అధికారులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, ప్రజాసంఘాల ,కుల సంఘాల నాయకులు హాజరై పూలమాలలు వేసి ఘన నివాళి అర్పించారు. కేశవపట్నంలో తెలంగాణ అంబేద్కర్ యువజన సంఘం మండలాధ్యక్షుడు అంతడుపుల సతీష్ ఆధ్వర్యంలో ప్రభుత్వ అధికారులు అధికారికంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన మాజీ జెడ్పిటిసి టిపిసిసి సభ్యులు బత్తిని శ్రీనివాస్ గౌడ్ మాట్లాడారు. డాక్టర్ భీమ్ రావు అంబేద్కర్ భారత రాజ్యాంగాన్ని రచించడంతో, ఆయన కృషి ఫలితంగా కుల మత భేదం లేకుండా నేడు రాజ్యాంగబద్ధంగా ప్రభుత్వం పేద బడుగు బలహీన వర్గాలకు సంక్షేమ పథకాలు అందుతున్నాయన్నారు. అంబేద్కర్ మహోన్నతమైన వ్యక్తి, అంబేద్కర్ ప్రపంచ దేశాల్లో సంస్కరణ సృష్టించారని తెలిపారు. అంబేద్కర్ ప్రపంచ మేధావిగా పేరు గడిచారని, ప్రతి ఒక్కరూ అంబేద్కర్ ను ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. రాజ్యాంగబద్ధంగా యువత ముందుకు సాగితం హక్కులనుపొందాలన్నారు. పేద ధనిక భేదం లేకుండా అంబేద్కర్ చదివే లక్ష్యంగా ముందుకు సాగి అనేకమైన డిగ్రీలను పొందాడని గుర్తు చేశాడు.
ఈ కార్యక్రమంలో ఎమ్మార్వో బత్తుల భాస్కర్ ,ఎంపీడీవో గోల్కొండ కృష్ణ ప్రసాద్ ,ఎస్సై కొత్త పెల్లి రవి ,డిప్యూటీ ఎమ్మార్వో పార్థసారథి, ఆర్ ఐ ప్రత్యూష, కార్యదర్శి నరసయ్య, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు గోపగోని బసవయ్య గౌడ్, యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు ఆడెపు అజయ్, మహిళా బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షురాలు కవ్వ పద్మ శ్రీనివాసరెడ్డి, కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు చింత రెడ్డి పద్మ, బిజెపి మండల అధ్యక్షుడు అనిల్, బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు గంట మైపాల్, తెలుగుదేశం పార్టీ కరీంనగర్ పార్లమెంట్ హడక్ కమిటీ సభ్యులు మోరె ప్రభాకర్, బి ఎస్ పి మండల అధ్యక్షుడు దేవుని భాస్కర్ ,మాజీ సర్పంచులు గొడిశాల రాజ కొమురయ్య, దొంగల రాములు, కొండ్ర రాజయ్య , దాసారపు భద్రయ్య, రంజిత్ రావు, హుజురాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ నాంపల్లి తిరుపతి, మాజీ వైస్ చైర్మన్ చౌడమల్ల వీరస్వామి, ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకుడు ఆడెపు నరసయ్య, ఎం హెచ్ పి ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ సముద్రాల సంపత్, తాజా మాజీ ప్రజాప్రతినిధులు, వివిధ సంఘాల నాయకులు, ప్రజా సంఘాల నాయకులు, తదితరులు పాల్గొన్నారు.



