ఆర్టీసీ బస్సు రన్నింగ్ లో ఉండగా డ్రైవర్ కు హార్ట్ ఎటాక్ వచ్చింది. అయినా నొప్పిని భర్తిస్తూ.. ప్రయాణికులను సురక్షితంగా కాపాడి బస్సు డ్రైవర్ ప్రాణాలు విడిచాడు. ఈ విషాదకర ఘటన ఖమ్మం జిల్లాలో గురువారం చోటుచేసుకుంది. జిల్లాలోని వేంసూరు మండలం రామన్నపాలెం గ్రామానికి చెందిన కాకాని శ్రీనివాసరావుగా గుర్తించారు. ప్రయాణికులు తెలిపిన వివరాల ప్రకారం.. సత్తుపల్లి నుంచి ఖమ్మం వైపు ఆర్టీసీ బస్సు వెళ్తున్నది. ఈ క్రమంలో డ్రైవర్ శ్రీనివాసరావుకు గుండెనొప్పి వచ్చింది. దీంతో గుండెలో నొప్పిని భరిస్తూనే బస్సును కల్లూరు ప్రభుత్వ దవాఖాన సమీపం వరకు తీసుకెళ్లి ఆపాడు. ఇది గుర్తించిన ప్రయాణికులు వెంటనే ఆయనను దవఖానాకు తీసుకెళ్లారు. అయితే, కొద్దిసేపటికే చికిత్స పొందుతూ డ్రైవర్ శ్రీనివాసరావు మృతిచెందారు. గుండెపోటుతోనే ఆయన చనిపోయిట్టు డాక్టర్లు వెల్లడించారు. గుండెపోటు వచ్చినా ప్రయాణికులను కాపాడిన డ్రైవర్ శ్రీనివాస్‌రావు మృతి పట్ల ప్రయాణికులు కన్నీటి పర్యంతమయ్యారు..
ఇవి కూడా చదవండి
Robbery in Gold Shop” పట్టపగలే బంగారం షాప్‌లో దోపిడీ.. సీసీ కెమెరాల్లో వీడియో రికార్డు..
Medaram Jatara” మేడారం వెళ్లలేక పోతున్నారా.. ఓ గుడ్ న్యూస్