ఆర్టీసీలో ఆ టికెట్లు ర‌ద్దు.. మ‌రో కీల‌క ప్ర‌క‌ట‌న‌

మ‌హాల‌క్ష్మీ స్కీమ్‌లో భాగంగా మ‌హిళ‌లకు ఆర్టీసీలో ఫ్రీ టికెట్ సౌక‌ర్యం క‌ల్పించిన విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ఆర్టీసీ ఓ కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. గ్రేటర్ హైదరాబాద్ లో జారీ చేసే ఫ్యామిలీ-24, టి-6 టికెట్లను ఉపసంహరించుకోవాలని TSRTC యాజమాన్యం నిర్ణయించింది. ఈ మేరకు ఫ్యామిలీ-24, టి-6 టికెట్లను జనవరి 1, 2024 నుంచి పూర్తిగా నిలుపుదల చేస్తున్నట్లు ప్రకటించింది. “ఫ్యామిలీ-24, టి-6 టికెట్లను జారీ చేయాలంటే ప్రయాణికుల గుర్తింపు కార్డులను కండక్టర్లు చూడాల‌ని, వారి వయసును నమోదు చేయాల్సి ఉంటుంద‌ని పేర్కొంది. మహాలక్ష్మి స్కీం వల్ల రద్దీ పెరగడంతో ఫ్యామిలీ-24, టి-6 జారీకి కండక్టర్లకు చాలా సమయం పడుతోంద‌ని ఆర్టీసీ ఎండీ స‌జ్జ‌నార్ ట్వీట్ట‌ర్ (ఎక్స్‌) రాసుకొచ్చారు. ఫలితంగా సర్వీసుల ప్రయాణ సమయం కూడా పెరుగుతోంద‌ని పేర్కొన్నారు. ప్రయాణికులకు ఆ సౌకర్యం కలిగించొద్దనే ఉద్దేశ్యంతో ఫ్యామిలీ-24, టి-6 టికెట్లను ఉపసంహరించాలని సంస్థ నిర్ణయించింద‌ని టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్ తెలిపారు. రూ.300 చెల్లించి ఫ్యామిలీ-24 టికెట్‌ కొంటే.. ఒక కుటుంబంలో నలుగురు సభ్యులు హైదరాబాద్‌లో 24 గంటల పాటు సిటీ ఆర్డినరీ, మెట్రో బస్సుల్లో ప్రయాణించడానికి అవకాశం ఉండేది. టీ-6 టికెట్‌కు రూ.50 చెల్లించి ఉదయం 10 నుంచి సాయంత్రం 4 వరకు అంటే ఆరు గంటల పాటు హైదరాబాద్‌లో సిటీ ఆర్డినరీ, మెట్రో బస్సుల్లో ప్రయాణించే వెసులుబాటు ఇన్నాళ్లు అమలైంది.

 

ఒకే కొత్త సంవ‌త్స‌రం అక్క‌డ 16 సార్లు జ‌రుపుకుంట‌రు..

వేర్వేరు ప్రమాదాల్లో ముగ్గురు దుర్మరణం

600 కిలోల అయోధ్య రామాలయ గంట

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *