Rajanna Siricilla Crime news” తెలంగాణ రాష్ట్రమంతటా పలు జిల్లాల్లో వానలు పడుతున్నాయి. ఈదురుగాలులు, ఉరుములు పిడుగులతో గురువారం మధ్యాహ్నం నుంచి వర్షాలు పడ్డాయి. రాజన్న సిరిసిల్ల జిల్లాలో భారీ వర్షం కురిసింది. వర్షంతో పాటు పిడుగులు పడడంతో ఇద్దరు వ్యక్తులు మరణించారు. తంగళ్లపల్లి మండలంలోని భరత్‌నగర్‌లో పిడుగుపడి చంద్రయ్య (50) అనే వ్యక్తి మరణించారు. వేములవాడ పట్టణ పరిధిలోని శాత్రాజ్‌పల్లిలో పిడుగు పాటుకు కంబాల శ్రీనివాస్ మృతి చెందాడు. ఇక్కడే ఉన్న మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈదురు గాలులతో పాటు భారీ వర్షాలకు రోడ్ల పక్కన చెట్లు విరిగిపడ్డాయి. పలు చోట్ల ఇంటి పైకప్పులు గాలికి కొట్టుకుపోయాయి. కరెంటు స్తంభాలు విరిగిపోయాయి. తెలంగాణాలో చాలా ప్రాంతాల్లో వెదర్ ఒక్కసారిగా మారిపోయింది.
ఇవి కూడా చదవండి
Bull Viral video” ఫోన్ ఆడిక్షన్ ప్రాణం మీదకు తెచ్చింది. కుళ్లపొడిచిన ఎద్దు.. వీడియో వైరల్
North korea” రెడ్ కల రెడ్ కలర్ లిప్‌స్టిక్‌పై ఉత్తర కొరియాలో నిషేధం
Mumbai News” బొంబాయిలో గాలిదుమారం బీభత్సం.. కూలిన హోర్డింగ్.. వీడియోలు వైరల్
Munner river”అయ్యో దేవుడా.. ఈత సరదా.. తీసింది పసివాళ్ల ప్రాణం