Kakinada Road Accident” ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు అన్న‌ద‌మ్ములు స్పాట్ డెడ్

Kakinada Road Accident

Kakinada Road Accident”  ఘోర రోడ్డు ప్ర‌మాదంలో ముగ్గురు మృతి చెందిన ఘ‌ట‌న కాకినాడ జిల్లా గండేప‌ల్లి మండలంలోని మురారి జాతీయ ర‌హ‌దారిపై మ‌ధ్యాహ్నం చోటు చేసుకుంది. వివ‌రాల్లోకి వెళ్తే.. ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా భీమ‌వ‌రం మండ‌లం తాడేరు గ్రామానికి చెందిన నంగ‌లం దుర్గ ఆమె కుమారులు రాజు, ఏసు, అఖిల్ కూలిప‌నులు చేసుకుంటూ జీవ‌నం సాగిస్తున్నారు. కూలిప‌నుల కోసం ఇత‌ర ప్రాంతాల‌కు వెళ్లి ప‌నులు చేసుకుని తిరిగి వ‌స్తుంటారు. ఇదే క్ర‌మంలో ఆదివారం పొద్దుగాల నర్సీప‌ట్నం నుంచి వారి బైక్‌పై తాడేరు వ‌స్తున్నారు. ఈక్ర‌మంలో గండేపల్లి జాతీయ ర‌హ‌దారి పై మురారి గ్రామం వ‌ద్ద‌కు చేరుకోగానే బైక్ అదుపు తప్పి కింద‌పడ్డారు. వెనుకాలే వ‌స్తున్న గుర్తు తెలియ‌న వాహ‌నం ఢీ కొట్ట‌డంతో అన్న‌ద‌మ్ములైన రాజు, ఏసు, అఖిల్ ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. వారి త‌ల్లి దుర్గ‌కు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడిన మహిళను రాజమ‌హేంద్ర‌వ‌రం ద‌వ‌ఖానాకు తీసుకెళ్లారు. మృతదేహాలను మార్చరీకి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు..!

ఇవి కూడా చ‌ద‌వండి

Funny Video” ఇది వైరైటి పార్కింగ్‌.. న‌డుములు విరిగాయ్.. వీడియో వైర‌ల్

Viral Video” ఈ బుడ్డోడి తెలివికి హ్యాట్స‌ఫ్ ..

Train Vrial Video” చెబితే విన‌రు. .ఫేమ‌స్ అవ‌డం కోసం.. కాలు, చేయి పొగొట్టుకున్న‌డు.. వీడియో

good thief” వైరైటి దొంగ‌.. సీసీ కెమెరా వ‌ద్ద ఆవేద‌న‌.. ఏమిలేక‌పోవ‌డంతో టైబుల్ పై రూ. 20 పెట్టి వెళ్లాడు. వీడియో

Flood rescue Drone” వర‌ద‌ల్లో చిక్కుకున్న వారిని ర‌క్షించే డ్రోన్‌… వీడియో

Mumbai Local Train” క‌దులుతున్న ట్రయిన్‌నుంచి కింద‌ప‌డిన వ్య‌క్తి… వీడియో

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *