Uttara Pradesh” భారీ వాహనాలు నడిచే రహదారిపై మధ్యలో ఓ వ్యక్తి కుర్చీ వేసుకుని దర్జాగా కూర్చొని ఉన్నాడు. రోడ్డుకు ఇరువైపులా ఉన్నవారంతా పక్కకు జరగాలని గట్టిగా కేకలు వేస్తున్నారు. అయినా అతడు పట్టించుకోలేదు. ఇంతలో ఓ లారీ వేగంగా దూసుకొచ్చి అతన్ని ఢీ కొట్టింది. దీంతో కుర్చీలోనుంచి ఎగిరి కిందపడ్డాడు. కిందపడి వెల్లకిలా చూస్తూ ఉండిపోయాడు. చుట్టు ఉన్నవాళ్లంతా లారీ డ్రైవర్ ను ఆపకుండా వెళ్లిపోమ్మని కేకలు వేశారు. ఇదంతా ఉత్తర ప్రదేశ్‌లోని ప్రతాప్‌గఢ్‌లో చోటు చేసుకుంది. అయితే ఆ వ్యక్తి మద్యం మత్తులో ఉన్నాడని కొందరు చెబుతున్నారు. అతని మానసిక స్థితి బాగాలేదని మరి కొందరు తెలిపిన సమాచారం. విషయం తెలుసుకున్న పోలీసులు ఆ వ్యక్తిని ఆస్పత్రికి తరలించారు. లారీ డ్రైవర్ కోసం గాలింపు చర్యలు చేపట్టినట్టు సమాచారం.
Drunk Man Narrowly Escapes Truck Collision on Busy Road While Sitting on the Chair, in the middle of the road, in Pratapgarh, UP.
The UP police arrived at the scene and took the man into custody for further treatment pic.twitter.com/EmeGNUwL9L
— Yumlok (@Yumlok01) August 31, 2024
ఇవి కూడా చదవండి
Hyderbad crime news” మెరుపు వేగంతో ఢీ .. గాల్లో ఎగిరిపడ్డ యువతి వీడియో
Nagar Kurnool” వరదలో కొట్టుకుపోతున్న వ్యక్తిని కాపాడిన పోలీసులు.. వీడియో
Nalgonda crime news” సెల్ఫీ తీసుకుంటుండగా ప్రమాదవశాత్తు కాలువలో పడిన మహిళ.. వీడియో