26.03.2025 ఉమ్మ‌డి క‌రీంన‌గ‌ర్ జిల్లా వార్త‌లు…

Karimnagar” యాసంగి ధాన్యం కొనుగోళ్లకు ప్రణాళిక సిద్ధం చేయాలి
కొనుగోలు కేంద్రాల్లో సౌకర్యాలు సమకూర్చాలి

రైతులకు అవగాహన కల్పించాలి

జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి
కరీంనగర్ :
యాసంగి ధాన్యం కొనుగోళ్లకు ప్రణాళిక సిద్ధం చేయాలని జిల్లా కొనుగోలు కమిటీ సభ్యులను కలెక్టర్ పమేలా సత్పతి ఆదేశించారు. యాసంగి ధాన్యం కొనుగోళ్లపై కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో మంగళవారం జిల్లా కొనుగోళ్ల కమిటీ సభ్యులు, అధికారులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ పమేలా సత్పతి మాట్లాడారు. ధాన్యం పూర్తిగా పరిపక్వతకు వచ్చిన తర్వాతనే హార్వెస్ట్ చేసేలా రైతులకు, హార్వెస్టింగ్ మిషన్ ఆపరేటర్లకు అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేయాలని సూచించారు. ధాన్యం కోతలకు సంబంధించి రెవెన్యూ గ్రామాల వారీగా నిర్దిష్ట ప్రణాళిక ఏర్పాటు చేయాలన్నారు. కొనుగోలు కేంద్రాల్లో తూకపు యంత్రాలు, తేమను కొలిచే యంత్రాలు, గన్ని సంచులు, టార్పాలీన్ కవర్లు వంటివి సిద్ధం చేయాలని ఆదేశించారు. ఇప్పుడు ఉన్న ప్యాడి క్లీనర్ లతో పాటు మరో 15 ప్యాడి క్లీనర్ లను కొనుగోలు చేయాలని సూచించారు. అన్ని కొనుగోలు కేంద్రాల్లో 24 గంటలు సిబ్బంది అందుబాటులో ఉండేలా చూడాలనన్నారు. ధాన్యం కొనుగోలు తర్వాత వెను వెంటనే వివరాలు ఆన్లైన్లో నమోదు చేయాలని తెలిపారు. రైతుకు సకాలంలో సొమ్ము అందేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. కొనుగోలు కేంద్రాల్లో సన్న, దొడ్డు రకాల ధాన్యాలు వేరువేరు ప్రదేశాల్లో ఉండేలా చూడాలని సూచించారు. ఎండాకాలం దృష్య్టా రైతులకు నీడ, తాగునీటి సౌకర్యం ఉండేలా చూడాలని తెలిపారు. సిబ్బంది కొనుగోలు రిజిస్టర్ ను అందుబాటులో ఉంచుకోవాలని, పకడ్బందీగా వివరాలు నమోదు చేయాలని ఆదేశించారు. తేమ యంత్రాన్ని నీడలోనే ఉండేలా చూడాలని సూచించారు.
ఈ సమావేశంలో అడిషనల్ కలెక్టర్ లక్ష్మీ కిరణ్, డిఆర్ఓ వెంకటేశ్వర్లు, ఆర్డీవో మహేశ్వర్ ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు.

////////////////////////////////////////////////////////////////////////////////

సైబర్ క్రైమ్ జరిగిన వెంటనే 1930 కి ఫోన్ చేయండి.. 

సైబర్ మోసాలపై అవగాహనా సదస్సు

రామగుండం వి టి సి గోదావరిఖని లో సైబర్ నేరాలపై, సైబర్ సెక్యూరిటీ బ్యూరో హెడ్ కానిస్టేబుల్ ఏ. శంకర్ ఆధ్వర్యంలో మంగళవారం అవగాహనా కార్యక్రమం నిర్వహించారు. ప్రస్తుతం జరుగుతున్న సైబర్ నేరాలు బెట్టింగ్ లు, డిజిటల్ అరెస్ట్, మ‌ల్టీలెవెల్లింగ్ మార్కెటింగ్, అడ్వర్టైజ్మెంట్ ఫ్రాడ్స్, ఫెడెక్స్ కొరియర్ ఫ్రాడ్స్ లోన్ యాప్ ల, ఓటీపీ, ఓఎల్ఎక్స్ ఫ్రాడ్స్ ల గురించి సైబర్ ట్రోల్ ఫ్రీ నెంబర్ 1930 ఇంపార్టెంట్స్ పై గురించి తెలిపారు. ఆన్లైన్ మోసాలపై అడ్డుకట్ట వేయుటకు తదితర అంశాలపై అవగాహన కల్పించారు. ప్రస్తుత సమాజంలో సెల్ ఫోన్ వలన ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో, అన్ని అనర్ధాలు కూడా జరుగుతున్నాయని, సెల్ ఫోన్ వినియోగం పట్ల ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలనన్నారు. ఆండ్రాయిడ్ ఫోన్ ఉపయోగం పెరగడం తో సైబర్ మోసాలు పెరుగుతున్నాయని మోసగాళ్ల ఉచ్చులో పడి నష్టపోకుండా ఉండాలని సూచించారు. ఎవరైనా సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయిన వెంటనే 1930 అనే టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా ఫిర్యాదు చేయాలని సూచించారు. ఈ అవగాహన కార్యక్రమంలో హెడ్ కానిస్టేబుల్ అట్టెం శంకర్, శేక్ రియాజ్, పెద్దల సంతోష్, కానిస్టేబుల్స్, కీర్తి వెంకటేష్, తిరుపతి, శ్రీనివాసు పాల్గొన్నారు.

///////////////////////////////////////////////////////////////////////

మార్చి 27న జాబ్ మేళా
పెద్దపల్లి :
జిల్లాలోని నిరుద్యోగ యువకులకు అపోలో ఫార్మసీ లో ఉద్యోగాలు కల్పించేందుకు ఈనెల 27న గురువారం పెద్ద‌ప‌ల్లి సమీకృత జిల్లా కలెక్టరేట్లో రూమ్ నెంబర్ 225 నందు జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారి వై. తిరుపతి రావు మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

అపోలో ఫార్మసీ సంస్థలో 50 ఫార్మసిస్ట్, ట్రైనీ ఫార్మసిస్ట్, ఫార్మసీ అసిస్టెంట్, రిటైల్ ట్రైనీ పోస్ట్లు ఖాళీగా ఉన్నాయని తెలిపారు. ఫార్మసిస్ట్, ట్రైనింగ్ ఫార్మసిస్ట్ పోస్టులకు బీఫార్మసీ లేదా ఫార్మసీ డిప్లమా , ఫార్మసీ అసిస్టెంట్, రిటైల్ ట్రైనీ పోస్ట్ లకు 10వ తరగతి ఉత్తీర్ణత సాధించిన వారు అర్హులని పేర్కొన్నారు. వీరి వయస్సు 18 నుంచి 35 లోపు ఉండాలని తెలిపారు.

ఆసక్తి ఉన్నవారు మార్చి 27న ఉదయం 11 గంటల సర్టిఫికేట్స్ జిరాక్స్ లతో పెద్ద‌ప‌ల్లి సమీకృత జిల్లా కలెక్టరేట్ కు వచ్చి తమ పేరు నమోదు చేసుకోవాలని కోరారు. మరిన్ని వివరాలకు 8247656356, 8985336947, 8121262441 నందు సంప్రదించాలని జిల్లా ఉపాధి అధికారి వై.తిరుపతిరావు ఆ ప్రకటనలో తెలిపారు.

///////////////////////////////////////////////////////////////////////////////

జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించాలి
– జర్నలిస్టులకు అండగా టీడబ్ల్యూజేఎఫ్
– అక్రిడేషన్లు, హెల్త్ కార్డులు వెంటనే ఇవ్వాలి
– టీడబ్ల్యూజేఎఫ్ జాతీయ కౌన్సిల్ మాజీ సభ్యులు కుడుతాడి బాపురావు
– వేములవాడలో విస్తృతంగా సభ్యత్వ నమోదు

జర్నలిస్టుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని టీడబ్ల్యూజేఎఫ్ జాతీయ కౌన్సిల్ మాజీ సభ్యులు, కరీంనగర్ జిల్లా కార్యదర్శి కుడుతాడి బాపురావు డిమాండ్ చేశారు. వేములవాడ పట్టణ కేంద్రంలో మంగళవారం తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ ఫెడరేషన్ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ముఖ్యఅతిథిగా హాజరైన బాపురావు మాట్లాడారు. జర్నలిస్టుల పరిస్థితులు దారుణంగా మారాయని, అనేక ఓడిదుడుకుల మధ్య వృత్తిబాధ్యతలు నిర్వహిస్తున్నారని వాపోయారు. చాలీచాలని వేతనాలతో బతుకులీడుస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. కొత్త ఆరోగ్య బీమా పథకాన్ని ప్రవేశపెట్టి ఉద్యోగుల మాదిరిగా అమలుచేయాలన్నారు. ప్రయివేటు, కార్పొరేట్ ఆస్పత్రుల్లో అమలయ్యేలా చొరవ తీసుకోవాలన్నారు. కొత్త అక్రిడిటేషన్ కార్డులను అందజేయడంలో మీడియా అకాడమీ విఫలమైందని విమ‌ర్శించారు. ఇప్పటికే మూడు సార్లు వాయిదా వేసిందని, వెంటనే అర్హులైన జర్నలిస్టులందరికీ కొత్త కార్డులివ్వాలని డిమాండ్ చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు పేరుక రవి మాట్లాడుతూ… రాష్ట్రంలో జర్నలిస్టులకు అండగా నిలిచే ఏకైక సంఘం తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ మాత్రమే అని అన్నారు. జర్నలిస్టుల హక్కుల సాధన కోసం నిరంతర పోరాటాలు చేస్తున్నదన్నారు. ప్రభుత్వ పదవుల కోసం, అక్రమ సంపాదన కోసం పాకులాడే సంఘాల పట్ల జర్నలిస్టులు అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. కొన్ని సంఘాలు జర్నలిస్టుల సమస్యలను గాలికొదిలేసి ప్రభుత్వాలకు కొమ్ము కాస్తున్నాయని ధ్వజమెత్తారు. వేములవాడ ప్రెస్ క్లబ్ అధ్యక్షులు కొప్పుల ప్రసాద్ మాట్లాడుతూ.. టీడబ్ల్యూజేఎఫ్ ప్రజాస్వామ్యబద్దంగా జర్నలిస్టుల సమస్యలపై పోరాడే యూనియన్ అని అన్నారు. జర్నలిస్టులందరూ ఐక్యంగా ఉండి సమస్యల పరిష్కారం కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు. జిల్లాలో జర్నలిస్టులకు అండగా ఉంటూ సంఘాన్ని మరింత బలోపేతం చేయాలని ఆయన జిల్లా నాయకత్వాన్ని కోరారు. అనంతరం కొత్త సభ్యులకు ఫెడరేషన్ సభ్యత్వాన్ని ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడు పెరుక రవి, జాతీయ కౌన్సిల్ సభ్యులు ఎండి యూసుఫ్, వేములవాడ అధ్యక్షుడు కొప్పుల ప్రసాద్, కార్యదర్శి అవదూత శ్రీధర్, కోశాధికారి నరేందర్, మాజీ అధ్యక్షుడు తొగరు కరుణాకర్ జర్నలిస్టులు జువ్వజి ఆంజనేయులు, వైస్ ప్రెసిడెంట్ కవ్వాల సురేందర్, ఎండి షబీర్, చందు, రఫిక్, వెంకటస్వామి, సిద్ధంశెట్టి వేణు, కోటగిరి శేఖర్, సిర్రం ప్రసాద్, ఎండి షరీఫ్, వెంకట మల్లు, తోట శేఖర్, తదితరులు పాల్గొన్నారు.

/////////////////////////////////////////////////////////////////////////////////////

టియు జేఏసీ జిల్లా అధ్యక్షునిగా యువరాజ్..
రాష్ట్ర సమావేశంలో యువరాజ్ నియామకం..
శంకరపట్నం డిసి ప్రతినిధి
తెలంగాణ ఉద్యమకారుల జాయింట్ యాక్షన్ కమిటీ కరీంనగర్ జిల్లా శాఖ అధ్యక్షునిగా శనిగరపు యువరాజ్ ను నియ‌మించిన‌ట్టు రాష్ట్ర చైర్మన్ సుల్తాన్ యాదగిరి తెలిపారు. ఈ సందర్భంగా రాష్ట్ర చైర్మన్ సుల్తాన్ యాదగిరి మాట్లాడారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం జరిగిన ఉద్యమంలో కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం, గద్దపాక గ్రామానికి చెందిన శనిగరపు యువరాజ్ అందించిన సేవలను, గుర్తించి ఈ నియామ‌కం చేప‌ట్టిన‌ట్టు తెలిపారు. ఈ మేర‌కు తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారుల జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర కమిటీ సమావేశం హైదరాబాద్ పట్టణంలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించిన‌ట్టు పేర్కొన్నారు. యువరాజు సేవలు వినియోగించుకునేందుకు, తెలంగాణ ఉద్యమకారుల జాయింట్ యాక్షన్ కమిటీ కరీంనగర్ జిల్లా శాఖ అధ్యక్షునిగా నియామకము చేసి నియామక పత్రాన్ని అందజేసినట్లు యాదగిరి తెలిపారు. ఈ సందర్భంగా యువరాజ్ మాట్లాడారు. తనపై ఎంతో నమ్మకంతో కరీంనగర్ జిల్లా తెలంగాణ ఉద్యమకారుల జాయింట్ యాక్షన్ కమిటీ అధ్యక్షునిగా నియామకము చేసిన, రాష్ట్ర చైర్మన్ సుల్తాన్ యాదగిరి, రాష్ట్ర నాయకులు రామ్ రెడ్డి, చంద్రన్న, ప్రసాద్, క్రిస్టఫర్, నియామకానికి కృషిచేసిన భోగే పద్మ లతో పాటు ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు. ఉద్యమకారులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చుటకు కృషి చేస్తాన‌న్నారు. జిల్లావ్యాప్తంగా తెలంగాణ జాయింట్ యాక్షన్ కమిటీ గ్రామస్థాయి, కమిటీలను మండల స్థాయి కమిటీలను నియామకము చేసి ఉద్యమకారుల ఆకాంక్ష నెరవేర్చేందుకు తన వంతు ఉద్యమాన్ని నిర్వర్తిస్తాన‌న్నారు.

///////////////////////////////////////////////////////////////////////////////

ఆశాలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలి…
సంఘం మండల అధ్యక్షురాలు రాజమణి…
శంకరపట్నం డిసి ప్రతినిధి
తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఆశా కార్యకర్తలకు ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని ఆశా కార్యకర్తల సంఘం మండల శాఖ అధ్యక్షురాలు రామగిరి రాజమణి అన్నారు. అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరని తెలిపారు. కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండల కేంద్రంలోని అంబేద్క‌ర్ విగ్రహం వద్ద మంగళవారం ఆశా కార్యకర్తలు కళ్లకు గంతలు కట్టుకొని వినూత్న నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రాజమణి మాట్లాడారు. 2023 లో జరిగిన శాసనసభ ఎన్నికల ప్రచార సమయంలో తెలంగాణలోని ఆశా కార్యకర్తలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని, ఆశా కార్యకర్తల సంఘం ఆధ్వర్యంలో హైదరాబాద్ పట్టణంలో ఈనెల 24న సెక్రటేరియట్ ముట్టడికి బయలుదేరిన ఆశా కార్యకర్తలను అరెస్టు చేసి కేసులు నమోదు చేశారని తెలిపారు. వారిని వెంటనే బేషరతుగా విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సమయంలో హామీల‌ను నేర‌వేర్చాల‌ని కోరారు. ప్రభుత్వానికి ఇప్పటికైనా కనువిప్పు కలగాలని మండల శాఖ ఆధ్వర్యంలో అంబేద్కర్ సాక్షిగా కండ్లకు గంతలు కట్టుకొని నిరసన కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకురాలు, లలిత, సులోచన, స్వరూప, రజిత తో పాటు వివిధ గ్రామాల ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

////////////////////////////////////////////////////////////////////////////////

అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరు..
మహిళా సంఘ వివో ల ముందస్తు అరెస్ట్…
శంకరపట్నం డిసి ప్రతినిధి
ముందస్తు అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరని మహిళా సంఘాల వివోల మండల సంఘం నాయకురాలు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. వివోఏల‌ రాష్ట్ర సంఘం పిలుపుమేరకు మంగళవారం సచివాలయం ముట్టడి కార్యక్రమానికి బయలుదేరిన మండల వివోఏ లను కేశవపట్నం పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు. ఈ సందర్భంగా సంఘం నాయకురాలు మాట్లాడారు. ఇప్పటికైనా ప్రభుత్వము వివోఎల న్యాయమైన సమస్యలను కోర్కెలను పరిష్కరించి తగి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. లేకుంటే ఆందోళనలో ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మండలంలోని వివిధ గ్రామాల మహిళా సంఘాల వివోలు, తదితరులు పాల్గొన్నారు.

///////////////////////////////////////////////////////////////////////////////////

అధికారులను కలిసిన సంఘ నాయకులు..
అధ్యక్షుడు రమేష్..
శంకరపట్నం డిసీ ప్రతినిధి
శంకరపట్నం జర్నలిస్టు యూనియన్ ఐజేయు సంఘ నాయకులు నూతన అధ్యక్షులుగా ఎన్నికైన జక్కోజు రమేష్ ఆధ్వర్యంలో మండల అధికారులను మర్యాదపూర్వకంగా కలిసినట్లు రమేష్ మంగళవారం తెలిపారు. ఈ సందర్భంగా రమేష్ మాట్లాడారు. ఇటీవల శంకరపట్నం మండలంలో ప్రెస్ క్లబ్ ఐజేయు అనుబంధ సంస్థ ఎన్నికలు జరగగా నూతన సంఘం సభ్యులందరం మండల స్థాయి అధికారులైన తాసిల్దార్ బత్తుల భాస్కర్, మండల వైద్యాధికారి గొట్టే శ్రావణ్ కుమార్ తో పటు ఇతర శాఖల అధికారులను మర్యాదపూర్వక కలిసినట్లు  తెలిపారు.  ఈ కార్యక్రమంలో జిల్లా ఈసీ మెంబర్ గాజుల స్వామి, ప్రధాన కార్యదర్శి మాతంగి శ్రీనివాస్, ఉపాధ్యక్షులు గొట్టే అర్జున్, దామెర సతీష్, బుర్ర సత్యనారాయణ, కోశాధికారి మోతే సదానందం, సహాయ కార్యదర్శి దేవునూరి రవీందర్ ,ప్రచార కార్యదర్శి పిన్ రెడ్డి తిరుపతిరెడ్డి, మండల కార్యవర్గ సభ్యులు, సీనియర్ పాత్రికేయులు తదితరులు పాల్గొన్నారు.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *