Munner river” ఈత సరదా ఇద్దరు పసివాళ్ల ప్రాణం తీసింది. సరదగా ఈతకు పోతే ప్రాణాలే పోయిన ఘటన ఖమ్మం జిల్లాలో గురువారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. ఖమ్మం రూరల్ మండలం ధంసలాపు రానికి చెందిన గణేష్ (14), లోకేష్(12) తో పాటు మరో బాలుడు స్థానిక మున్నేరు వాగులో ఈతకు వెళ్లారు. నీళ్లలో దిగాక ప్రవాహ వేగానికి ముగ్గురు గల్లంతయ్యారు. అక్కడే ఉన్న స్థానికులు గమనించి ఇద్దరి మృతదేహాలను వెలికి తీశారు. మరో బాలుడికోసం గాలిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. గ్రామంలో విషాద చాయలు అలుముకున్నాయి.
ఇవి కూడా చదవండి
Fish rain” ఇరాన్‌లో చేపల వర్షం.. వీడియో వైరల్
Latest Viral Video” కూలరా..? ఏసీనా…? అసలు ఎక్కడినుంచి వస్తయి ఈ ఐడియాలు వీడియో వైరల్
Karimnagar news” నువ్వు దేవుడు సామి.. ఎండవేడికి పెట్రోల్ బంక్ ఓనర్ కిరాక్ ఉపాయం..వీడియో వైరల్